TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఆడియో విశేషాలు

Published on: Mon Dec 17, 2012 9:57AM

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఆడియో రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. వెంకటేష్ కుమారుడు అర్జున్, మహేష్‌బాబు తనయుడు గౌతమ్‌ కృష్ణ ఈ ఆడియో ఫంక్షన్ కి గెస్ట్ లు గా వచ్చారు. ఆడియో రిలీజ్ స్టేజిపై వెంకటేష్, మహేష్‌లు నిజమైన అన్నదమ్ములా మెలిగారు. తొలి సీడీని వెంకటేష్‌ కుమారుడు అర్జున్‌ ఆవిష్కరించి మహేష్‌బాబు తనయుడు గౌతమ్‌ కృష్ణకి అందజేశారు.


దిల్ రాజు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌లో ఓ మంచి మల్టీస్టారర్‌ చిత్రాన్ని మా సంస్థ నిర్మించడం.. అందులో ఇద్దరు అగ్ర హీరోలు వెంకటేష్, మహేష్‌లు నటించడం, వీరికి సరిపడే కథను తయారు చేసిన ఈ చిత్ర దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాలకు ధన్యవాదాలు చెపుతున్నా అని అన్నారు. ఇది చాలా కాలం తర్వాత వస్తున్న కుటుంబ కథా చిత్రమని ఆయన చెప్పారు.  

 

SVSC songs|SVSC audio songs|svsc audio|mahesh babu svsc|Mahesh Babu